
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. కేవలం సమావేశాలు, సమీక్షలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు వేగంగా అందేలా అధికారులు చొరవ చూపాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను రూపొందించాలని ఆదేశించారు. మంచి పనితీరు కనబరిచే జిల్లాల విధానాలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని సూచించారు. పరిపాలనలో బాధ్యత, వేగం, నాయకత్వ లక్షణాలు పెంచాలని చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలకు అధికారులు తక్షణ స్పందన ఇవ్వాలని, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జాప్యాన్ని తగ్గించాలని ఆయన స్పష్టం చేశారు