
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు చర్చించారు.