పదవులు కాదు ప్రజాసేవ, అభివృద్ధే లక్ష్యం : ఆర్కే

సోంపేట: రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజలతో అనుబంధం, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం కొనసాగాలని భావించే వ్యక్తి కోదండ కృష్ణ (ఆర్‌కే). పదవిలో లేకపోయినా యువతకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లభించేలా సహకరించడం, తిత్లీ తుఫాను సమయంలో సొంత నిధులతో బాధితులకు అండగా నిలవడం, తల్లిదండ్రుల పేరుతో రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములయ్యారు. ఇప్పుడు సోంపేట మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయనతో ప్రజాసేవ, అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రశ్న: జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

ఆర్‌కే: ప్రజాసేవకు పదవులు మాత్రమే ప్రాతిపదిక కాకూడదు. గతంలోనూ నాకు సాధ్యమైనంతవరకు ప్రజలకు సహాయం చేశాను. ఇప్పుడు మరింత బాధ్యతతో సోంపేట మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచాను.

ప్రశ్న: యువత కోసం గతంలో మీరు ఏం చేశారు..?

ఆర్‌కే: యువతకు ఉపాధి లభిస్తే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. అందుకే నేను ఎలాంటి పదవిలో లేనప్పటికీ చాలామంది యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు లభించేలా నా వంతు సహకారం అందించాను. భవిష్యత్తులోనూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాను.

ప్రశ్న: గతంలో సోంపేటలో మీరు చేసిన సహాయ కార్యక్రమాల గురించి?

ఆర్‌కే: తిత్లీ తుఫాను సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు ఎంతో బాధించాయి. ఆ సమయంలో బాధితులకు నా సొంత నిధులతో సహాయసహకారాలు అందించాను. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తాను. అందుకే సాధ్యమైనంత వరకు సహాయం చేశారు. ఇప్పటికీ సోంపేట ప్రజలు మరిచిపోరు.

ప్రశ్న: మీ తల్లిదండ్రుల పేరుతో రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తోంది. దీని ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు?

ఆర్‌కే: అవును మా అమ్మానాన్నల పేరుతో రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. చదువులో ప్రతిభ కనబరిచే మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యతో పాటు ప్రజలకు ఉపయోగపడే వివిధ సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. సమాజానికి మా వంతు సేవ అందించాలన్నదే ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం.

ప్రశ్న: సోంపేట మండల అభివృద్ధికి మీ ప్రాధాన్యతలు ఏమిటి?

ఆర్‌కే: ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తాను.

ప్రశ్న: స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకులతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయాలు సోంపేట అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయి?

ఆర్‌కే: ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని పలువరు మంత్రులుతో పాటు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పలుమార్లు కలిసి ప్రాంతంలోని సమస్యలను వివరించి, వాటి పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేశాను. ప్రజల సమస్యలను సరైన వేదికపై ప్రస్తావించడం చాలా ముఖ్యం. అది నా బాధ్యత కూడా. ఇప్పుడు జెడ్పీటీసీగా అవకాశం లభిస్తే ఈ సమన్వయాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకుని, సోంపేట మండల అభివృద్ధి కోసం ఉన్నత స్థాయిలో సమస్యలను వివరించి పరిష్కారానికి కృషి చేస్తాను.

ప్రశ్న: ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు మీరిచ్చే హామీ ఏమిటి?

ఆర్‌కే: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. సాధ్యమైనంతవరకు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటాను. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా బాధ్యతగా, అదృష్టంగా భావిస్తాను.

ప్రశ్న: సోంపేట మండల ప్రజలకు చివరిగా మీరిచ్చే సందేశం ఏమిటి?

ఆర్‌కే: పల్లె నుంచి పట్నం వరకు అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలంటే బలమైన నాయకత్వం, స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికలు అవసరం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. గ్రామాలు అభివృద్ధి చెందాలి, యువతకు ఉపాధి రావాలి, పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి. సోంపేట మండలం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నాను. మీ ఆశీర్వాదం, సహకారంతో ప్రజాసేవకు మరింత అంకితమవుతాను.
—

సేవా కార్యక్రమాల నుంచి అభివృద్ధి లక్ష్యాల వైపు:

యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో సహకారం, తిత్లీ తుఫాను బాధితులకు వ్యక్తిగతంగా చేయూత, రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతిభావంతులకు ప్రోత్సాహం.. ఇలా వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైన రెయ్యి కోదండ కృష్ణ (ఆర్‌కే), ఇప్పుడు సోంపేట మండల అభివృద్ధిని తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జై తెలుగుదేశం!