జగన్, అవినాష్ లపై ఎస్ఈసి కి టిడిపి నేతల ఫిర్యాదు 

అమరావతి : వైసిపి అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ లపై టిడిపి ముఖ్య నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ రోజున జగన్ మోహన్ రెడ్డి చేసిన డ్రామా, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో 16 వ డివిజన్ లోని గుణదల బూత్ నెంబర్ 5 లోకి పోలింగ్ జరుగుతుండగా అక్రమంగా ప్రవేశించిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీరును రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వివరించారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో పార్టీ నాలెడ్జి కమిటీ చైర్మన్ గురజాల మాల్యాద్రి , జాతీయ అధికార ప్రతినిధి ఏపీ బయో డైవర్సిటి బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, టిడిపి యువ నేత బండారు వంశీకృష్ణ ల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది