“కూటమి” పై చెక్కుచెదరని నమ్మకం

అమరావతి : ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నికల సిబ్బంది తదితర వర్గాలు సైతం ఎన్డీయేకే ఓట్లు వేశారు. నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన మోసాలు, అవమానాలు దీనికి ఓ కారణం కాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, తమకు అన్ని విధాలుగా అండగా నిలవడంతోనే ఉద్యోగులు ఎన్డీయేపై తమ నమ్మకం చెక్కుచెదరలేదని చాటారు.