
అమరావతి : పట్టణాల నుంచి పల్లెల వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకే ప్రజలు ఏకగ్రీవంగా పట్టంకట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంపై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పల్లా గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అపూర్వ విజయం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా, కేసులు వేసినా బ్యాలెట్ ద్వారా ప్రజలు కూటమి పక్షానే నిలిచి 90% నుండి 95% వరకు స్ట్రైక్ రేట్ అందించారని తెలిపారు.
విజయం కోసం శ్రమించిన కూటమి నాయకులు, సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ… ఇదే ఉత్సాహం మరియు బాధ్యతతో 2029 ఎన్నికల్లోనూ విజయాన్ని పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.