సమిష్టిగా ఏపీ ని నెంబర్ -1 గా నిలపడానికి పని చేద్దాం- లోకేష్   

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఫలాలు. ఈ విజయం కూటమి పార్టీల మధ్య సమన్వయం, సమష్టి కృషికి నిదర్శనం.

ఘన విజయానికి కారకులైన ప్రజలు, కూటమి పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నగరమైనా, పట్టణమైనా, పల్లెలైనా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే జై కొడుతున్నారు.

ఓటమి లేని కూటమి జైత్రయాత్ర.. జనం మనపై పెట్టుకున్న నమ్మకం, మనకు అప్పగించిన బాధ్యత. గెలుపు అహంకారం దరిచేరకుండా ప్రజాసేవకు పునరంకితం అవుదాం.

రాగ ద్వేషాలకు అతీతంగా, వివక్ష లేని సుపరిపాలనను నిస్వార్థంగా అందిద్దాం. ప్రగతిలోనూ, ప్రజా సంక్షేమంలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిపేందుకు అంతా కలిసి పని చేద్దాం.