గైనిక్ పీజీలో డాక్టర్. సయ్యిదా షాహిరా కు మొదటి స్థానం

హైదరాబాద్ : డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, హైదరాబాద్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న కర్నూల్ కి చెందిన డాక్టర్ సయ్యదా షహీరా ఎం.ఎస్. (ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ) పోస్టుగ్రాడ్యుయేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

 

ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన 42వ స్నాతకోత్సవ వేడుకలో కళాశాల ప్రిన్సిపాల్ ఆమెకు పోస్టుగ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం చేశారు.

కళాశాల 2022-25 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రసూతి, గైనకాలజీ విభాగంలో నిర్దేశిత విద్యా కోర్సుతో పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

అంతేకాకుండా పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షల్లో విభాగంలో ప్రథమ స్థానం సాధించి డిపార్ట్‌మెంటల్ మెరిట్ అవార్డు – అకడమిక్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

స్త్రీ మరియు ప్రసూతి విభాగంలో మహిళలకు నాణ్యమైన, నమ్మకంతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య రంగంలో ముందుకు సాగుతానని డాక్టర్ సైదా షాహీరా పేర్కొన్నారు.

విద్యా ప్రతిభతో పాటు పట్టుదల, కృషితో ఈ ఘనత సాధించిన డాక్టర్ సయ్యదా షహీరాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తున్నారు.

భవిష్యత్తులో వైద్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

ఈమె ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి గారి ఓ.ఎస్.డి సయ్యద్ ఖాజా మొహియుద్దీన్ కోడలు.

ఆమె భర్త డాక్టర్. జావెద్ అష్రఫ్ బెంగుళూరులోని వైదేహి అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ అకాడమీ అధిపతి గా పని చేస్తున్నారు.