జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం 

విజయవాడ : జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ విజయవాడ ప్రెస్ క్లబ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.

సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరిగే ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ హాజరై ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రులందరూ హాజరై రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఈ శిబిరంలో రక్తదానం చేసిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సర్టిఫికెట్ అందజేయబడుతుంది. ఆ సర్టిఫికెట్ ఉన్నవారు ఎప్పుడైనా వారికి అవసరమైన బ్లడ్ గ్రూప్స్ సగం ధరకే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పొందే అవకాశం ఉంది.

కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

రక్తదానం చేసేవారు ప్రెస్ క్లబ్ లో ముందుగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు.