సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం బ్రహ్మోత్సవాల […]

హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్

అమరావతి: పవిత్ర హజ్ యాత్ర-2027కు ఎంపికైన యాత్రికులకు జిల్లాల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మైనారిటీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎంపికైన హాజీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి […]

నేతన్నలకు గుడ్ న్యూస్

అమరావతి: నేతన్న భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ఇకపై పింఛన్ దరఖాస్తుతో బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు పొందుతున్నట్లు వివరాలు అందజేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధనతో చేనేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు […]

హ్యాట్రిక్” అచ్చెన్న – వరుసగా మూడోసారి నంబర్‌ వన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో మంత్రి పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ల సమావేశంలో అచ్చెన్నాయుడు పనితీరును సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తున్నారని అభినందించారు. వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ-ఫైలింగ్ […]

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

  తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ నెల 9న తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 14న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. […]