ఏపీలో తుది దశకు ‘సర్’!

నోటీసుల విచారణ ప్రగతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియ తుది దశకు చేరుకుందని అడిషనల్ సీఈఓ ఢిల్లీరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసులలో 44 లక్షల నోటీసుల విచారణ పూర్తయిందని, నోటీసుల పంపిణీ 99.35 శాతానికి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం 28 వేల నోటీసులు మాత్రమే విచారణకు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు
జిల్లాల వారీగా పురోగతి మరియు పెండింగ్

అల్లూరి, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మెరుగైన పురోగతి నమోదు కాగా.. ఏలూరు, పల్నాడు, తిరుపతి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అధికంగా పెండింగ్‌లో ఉన్నాయి.

​ఫోటోల ఆమోదం మరియు దరఖాస్తుల పరిష్కారం

రాష్ట్రంలో 3.71 కోట్ల ఫోటోల్లో బిఎల్వోలు 3.67 కోట్ల ఫోటోలను ఆమోదించారని, ఫారం-6 కింద 1.41 లక్షలు, ఫారం-7 కింద 10,742, ఫారం-8 కింద 69 వేల దరఖాస్తులు పరిష్కారానికి వేచి ఉన్నాయని తెలిపారు.