జగన్@వికృత మనస్తత్వం-అప్పసాని

అమరావతి : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ఢిల్లీ వెళ్లి, నేషనల్ మీడియా ముందు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేసిన వికృత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది అని టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని ద్వజమెత్తారు.అలాంటి వ్యక్తి నేడు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో పరుగులు తీస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వ బ్రాండింగ్‌ను ఎలాగైనా దెబ్బతీయాలనే దురుద్దేశంతో జగన్ తీవ్ర నేరపూరిత కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.