“బోత్ ఆర్ నాట్ సేమ్ “- చెంచు వేణుగోపాల్ రెడ్డి

అమరావతి : ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి… తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కు పోలికే లేదని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి చెంచు వేణుగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం, సుస్థిర పాలన కోసం, స్వర్ణాంధ్ర–2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం గురించి వైసిపి నాయకులకు విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు.

స్వలాభం కోసం, అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం, తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్న వైసీపీ జగన్‌ గారికి చాలా తేడా ఉందని “బోత్ ఆర్ నాట్ సేమ్” అన్నారు.

రెండూ ఒక్కటి కాదని,అసలు పోలికే లేదన్నారు.ఒకవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ప్రభుత్వంను, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకోవడాన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలాంటి మాటలు, ఇలాంటి రాజకీయాలు జగన్ పార్టీ చేస్తున్నదని విమర్శించారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అభివృద్ధికి అడ్డుపడే రాజకీయాలను ప్రజలే తిప్పికొడతారని చెంచు వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.