ఆత్మకూరులో అభివృద్ధి జాతర

ఆత్మకూరు: దేవాదాయ శాఖ మంత్రి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరులో అట్టహాసంగా ప్రారంభమైన భారీ అభివృద్ధి కార్యక్రమాల పండుగ కు పునాదులపడ్డాయి.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, కావలి శాసన సభ్యులు కృష్ణారెడ్డి,నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు స్వాగతం పలికారు. ₹45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆత్మకూరు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో పైలాన్ ఆవిష్కరణ.. పలు కీలక పనులకు శంకుస్థాపనలు మంత్రులు చేశారు. రాష్ట్ర మంత్రుల రాకతో ఆత్మకూరులో సందడిగా అభివృద్ధి కార్యక్రమాలు సాగాయి. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రులు… కోలాహలంగా బైక్ ర్యాలీ జరిగింది.భారీగా కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంత్రి ఆనం ఆధ్వర్యంలో ఒకే రోజు ₹53.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.