
అమరావతి : ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించడం పట్ల ఏపీ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ జట్టు కు అభినందనలు తెలిపారు.భారత మహిళల జట్టు విజయం దేశ క్రీడా స్ఫూర్తికి ప్రతీక, గర్వకారణం అని ప్రశంసించారు.ఏషియన్ గేమ్స్‌లో జట్టు క్రీడాకారుల ప్రతిభ అభినందనీయమని అన్నారు.సమష్టి కృషితో పోరాడి గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు, శ్రీ చరణికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.