టైం, డేట్ ఫిక్స్ చేయ్ తేల్చుకుందాం – నారా లోకేష్

రాప్తాడు:శాప్ కార్యాలయం వద్ద విద్యనేర్పే గురువులపై గొడ్డలిపార్టీ రౌడీమూకలు విచక్షణారహితంగా గుడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్ లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. ఎపిలోనే కాదు, అండమాన్ లో ఉన్నా, ఆస్ట్రేలియా వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తామని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ టెన్త్ క్లాస్ తప్పాడు. అందువల్లే టీచర్లపై కక్ష పెంచుకున్నాడు. నిన్న ఉపాధ్యాయులపై రౌడీమూకలను ఉసిగొల్పాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మేం భయపడలేదు, ఇప్పుడు భయపడతామా? నీతి, నిజాయితీగా బతికిన కుటుంబం మాది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైలులో పెట్టారు, ఒక్కటైనా నిరూపించ గలిగారా? ఆయనపై పెట్టిన ఒక్క కేసుకూడా నిలబడలేదు. నాపై కోపం ఉంటే నేరుగా రా… టైమ్, డేట్ ఫిక్స్ చెయ్యి, తేల్చుకుందాం. కల్తీ మద్యం, ఎపిపిఎస్సీపై కూడా చర్చిద్దాం. నాపై కోపం ఉంటే నాతో తేల్చుకో. అంతేగానీ ఉపాధ్యాయుల జోలికొస్తే సహించేది లేదని లోకేష్ హెచ్చరించారు.