
నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ప్రత్యేక ఆహ్వానం అందించారు.వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, దేవస్థాన పాలక మండలి సభ్యులకు, పట్టణ ప్రముఖులకు, దేవాదాయ శాఖ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలను మంత్రి తెలిపారు.సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనున్న పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరగనుంది. జాతరను భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను మంత్రి కి వివరించారు.అక్టోబర్ 1వ తేదీన జరిగే అమ్మవారి నిలుపు, నగరోత్సవం, నిమజ్జనం కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం స్వయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ, భక్తులందరూ ఈ జాతర మహోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.