పోరాటాల గడ్డ “మదనపల్లె”- నారా లోకేష్ 

మదనపల్లి : మదనపల్లె లో జరిగిన గ్లోబల్ హార్టీకల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ ప్రసంగించారు.

స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, బ్రిటీష్ అరాచకానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డ మదనపల్లె. జాతీయ గీతం జనగణమనకు బాణి కట్టి ఆంగ్లంలో అనువదించిన బీటీ కాలేజి గడ్డ మదనపల్లె నుంచి ఈ చారిత్రక కార్యక్రమం చేపట్టాం.

గాంధీజీ చంపారన్, గ్రామ స్వరాజ్య లాంటి పోరాటాలతో పాటు రైతుల తరపున పోరాడారు. రైతులు బాగుంటే, గ్రామీణ ప్రాంతాలు బాగుంటే దేశం బాగుంటుందని కలలు కన్న వ్యక్తి గాంధీజీ.

రాయలసీమ ప్రజలు చూపించిన ప్రేమతోనే నన్ను నిరోధించినా యువగళం పాదయాత్ర చేశాను. టమాటో, బొప్పాయి సహా వేర్వేరు ఫలసాగు చేస్తున్న రైతులతో మాట్లాడి మిషన్ రాయలసీమ అనే డిక్లరేషన్ ఇచ్చాం.

ఆనాడే రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మారుస్తామని డిక్లరేషన్ ద్వారా ప్రకటన చేశాం. ఇక్కడ సాగైన ఉద్యాన పంటలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తాం

అందుకే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్, ప్రధాని మోదీ సహకారంతో ఈ కల నేరవేరుస్తున్నాం. రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని సీబీఎన్ పరిచయం చేశారు.

ప్రముఖ ఆంగ్ల పత్రిక సీఎం చంద్రబాబును వాటర్ మాన్ అంటూ కీర్తిస్తే గొడ్డలి పార్టీ తట్టుకోలేక పోతోంది. సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేస్తుంటే ఓర్చుకోలేక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

హంద్రినీవా, వెలిగొండ, పోలవరం ఇలా అన్ని ప్రాజెక్టులు మా ప్రభుత్వ ట్రేడ్ మార్కులే. హార్టికల్చర్ అయినా క్వాంటం టెక్నాలజీ అయినా చంద్రబాబు ముందు చూపూ చాలా ముందే ఉంటుంది.

సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేక మంది పారిశ్రామిక వేత్తలను తయారు చేసింది. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అదే మ్యాజిక్ ను సృష్టించబోతోంది.

అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు అవుతుంది. మన భారత్ కే కాదు ఇతర దేశాలకు కావాల్సిన ఉద్యాన పంటలను కూడా పండించేలా ఐఎస్ఏ సహకారం అందిస్తుంది

బత్తాయి, దానిమ్మ, అవకాడో, బెర్రీస్, అరటి లాంటి వివిధ పంటలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. మన రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్ అండ్ డీతో పాటు మార్కెట్ ఇంటెలిజెన్స్ వరకూ ఐఎస్ఏ సహకారం అందిస్తుంది.

అన్నదాతలకు సహకారం అందించేలా ఏర్పాటు అవుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పుడూ రైతుల మేలు గురించే ఆలోచన చేస్తారు. అందుకే ఇది సాధ్యమైంది.

హార్టీ కల్చర్ హబ్ ద్వారా రాయలసీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలుస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కూడా ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ బిడ్డే- నారా లోకేష్