
ఉండవల్లి: స్థానిక ఎన్నికల వేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది.
విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన పలువురు సీనియర్ వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
మంగళగిరి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డి, కళ్లం సాంబిరెడ్డి, కళ్లం శ్రీనివాసరెడ్డితో పాటు ఆరు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నేత, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ ప్రత్యేక ఆహ్వానితులు, స్టేడ్ రెడ్డి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సూరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సూరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి లక్ష్మారెడ్డి, బొమ్మి కోటిరెడ్డితో పాటు నాలుగు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన వైసీపీ నేత దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డితో పాటు రెండు కుటుంబాలు, మంగళగిరి రూరల్ నిడమర్రుకు చెందిన వైసీపీ సీనియర్ నేత కట్టెపోగు బాబురావుతో పాటు 6 కుటుంబాలు, మంగళగిరి రూరల్ యర్రబాలెంకు చెందిన గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణతో పాటు ఐదు కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.