
అమరావతి : రాష్ట్రంలో పనిచేస్తున్న న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ఈనెల 1వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 61 నుండి 62 సంవత్సరాలకు పెంపు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పెంపు 31-03-2026 నుండి అమల్లోకి వచ్చినట్లుగా భావించబడుతుందని పేర్కొంటూ రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో గెజిట్ ప్రచురణ కూడా ప్రచురించబడినట్లు మంత్రి తెలిపారు.
కాగా గతంలో 01-11-2024 నుంచి అమలులోకి వచ్చేలా న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు
పొడిగించబడిన విషయం తెలిసిందేనని మంత్రి ఫరూక్ తెలిపారు. ఆ పిమ్మట భారత సర్వోన్నత న్యాయస్థానo సుప్రీంకోర్టు 05-08-2026వ తేదీన 1989 యొక్క డబ్ల్యు.పి.(సి) నెం.1022లో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వు లో సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పునః పరిశీలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడo జరిగిందన్నారు.
దీనిపై 24-08-2026న జరిగిన పూర్తిస్థాయి సమావేశంలో ఏపీ హైకోర్టు ధర్మాసనం కూడా 62 ఏళ్లకు పెంచాలని తీర్మానించిందన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనతో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ అయిందని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.