మిషన్ కర్మయోగి: సెప్టెంబర్ 29న విజయవాడలో సాధన శృంఖల-2026 దక్షిణాది ప్రాంతీయ వర్క్‌షాప్
విజయవాడ: దేశంలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతో చేపట్టిన #MissionKarmayogi (మిషన్ కర్మయోగి)లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. ఈ నెల 29న (సెప్టెంబర్ 29) విజయవాడలో ‘సాధన శృంఖల-2026 (Sadhana Shrinkhla 2026) దక్షిణాది ప్రాంతీయ వర్క్‌షాప్‌ను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కేంద్ర సహాయ మంత్రి (సహాయ హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ జాతీయ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన ‘ఉన్నతి’ (UNNATI) పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 900కు పైగా శిక్షణా సంస్థలను అనుసంధానిస్తున్నారు. సాంప్రదాయక ప్రామాణిక శిక్షణ స్థానంలో, విధులకు సరిపడే వినూత్న “కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్” (Capacity Building Plans) రూపకల్పన చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. “సరైన సమయానికి, సరైన విధులకు, సరైన సామర్థ్యాన్ని పెంపొందించడం” (Right Capacity Building for the Right Role at the Right Time) అనే సూత్రంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ శృంఖలలో భాగమైన ‘కర్మయోగి కర్తవ్య కార్యక్రమ్’ ద్వారా క్షేత్రస్థాయి ఆశా కార్యకర్తల నుంచి ఉన్నతాధికారులైన కార్యదర్శుల (Secretaries) వరకు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలలో శిక్షణ ఇస్తారు. ప్రజా కేంద్రీకృత పాలన అందించడం ద్వారా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (Viksit Bharat @ 2047) సాధనలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుంది.
