తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను టీటీడీ అధికారులు విడుదల చేశారు.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధికమాసం కారణంగా ఈ ఏడాది స్వామివారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కన్యామాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగగా, దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఆశ్వయుజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవని టీటీడీ స్పష్టం చేసింది.
