దటీజ్ @ బీసీ జనార్ధన్ రెడ్డి

బనగానపల్లె : ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను ఏకంగా రూ. 1.60 కోట్లు మొత్తాన్ని వెచ్చించి బనగానపల్లెలో షాదీ ఖానా భవనాన్ని పూర్తిచేసి దటీజ్ @ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అని తన నియోజకవర్గ ప్రజల చేత శభాష్ “మినిస్టర్” అనిపించుకుంటున్నారు ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి. బనగానపల్లెలో నూతన షాదీఖానాను బీసీ జనార్దన్ రెడ్డి, మైనారిటీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వేలాదిమంది ముస్లింల

మధ్య ప్రారంభించారు.రూ.2.60 కోట్లతో నిర్మించిన షాదీఖానాను ముస్లిం సమాజానికి మంత్రులు అంకితం చేశారు. షాదీఖానా నిర్మాణానికి రూ.1.60 కోట్ల సొంత నిధులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెచ్చించారు. మరో రూ.18 లక్షల సొంత నిధులతో వంట పాత్రలు, షామియానాలను కూడా మంత్రి బీసీ ఏర్పాటు చేశారు.2018లో మంజూరై మధ్యలో నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.విశాలమైన ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, వధూవరుల గదులు, పార్కింగ్ సదుపాయాలతో షాదీఖానా నిర్మాణం పూర్తి చేశారు.ముస్లిం కుటుంబాల వివాహాలు, శుభకార్యాల నిర్వహణకు నూతన షాదీఖానా అందుబాటులోకి వచ్చింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ముస్లిం కుటుంబాల కల సాకారం కావడం, ఇద్దరు మంత్రుల చేతుల మీదుగా షాదీఖానా ప్రారంభోత్సవం తో బనగానపల్లెలో సందడి వాతావరణం నెలకొంది.