
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి.పవిత్రోత్సవాలలో భాగంగా రొండవ రోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో జేఈవో శరత్ కుమార్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొన్నారు.ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.ఆలయంలో పూజ అనంతరం పసుపు, కుంకుమ, పూలతో కూడిన సామాగ్రిని అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే గారి దంపతులను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.