SIRపై మా అభిప్రాయం ఇదే – నారా లోకేష్

ఒక రాజకీయ పార్టీగా టీడీపీ SIRకు సంబంధించిన వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు వివరణలు కోరింది.
ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను టీడీపీ పరిశీలించింది. అది సక్రమంగానే ఉందని మేము భావిస్తున్నాం.
ఇక ముందు కూడా ఈ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి మావంతు సలహాలు, సూచనలు ఇస్తాం.
కొంతమంది ఓటర్లు మరణించడం, కొంతమంది నివాసాలు మార్చుకోవడం వల్ల కొన్ని అనుమానాలకు, సందేహాలకు అవకాశం ఉండొచ్చు.
కానీ మేము మా రాష్ట్రంలో ఈ ప్రక్రియను ఎదుర్కొన్నాం. మా పార్టీ 92 శాతం ఓట్లను మ్యాప్ చేసింది.
ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఓటర్ల మ్యాపింగ్ చేస్తోంది.
మేము అవసరమైన పత్రాలను సమర్పించాం. ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నామని అన్నారు మంత్రి నారా లోకేష్.